రాజాసింగ్ అరెస్ట్.. శంకరంపేటలో ఉద్రిక్తత

కలం, డెస్క్ : ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి, బాన్సువాడలో నెలకొన్ని పరిస్థితులను పరిశీలించేందుకు రాజాసింగ్ వెళ్తుండగా.. మెదక్ జిల్లా శంకరంపేటలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో భజరంగ్ దల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో శంకరంపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. బాన్సువాడలో హిందూ, ముస్లిం యువకుల మధ్య జరిగిన ఘర్షణలు, కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి ముట్టడి టైమ్ లో జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి.

Read Also: కుమ్మెర ఘటన.. నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>