Mobile Popup Ad
Mobile Popup Ad

కుమ్మెర ఘటన.. నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన

కలం, డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర (Kummera Incident) గ్రామంలో జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, బాధిత కుటుంబీకులు నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కావాలనే పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మర్రి జనార్ధన్ రెడ్డి విమర్శించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు.

కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతరలో చంద్రకళ కుటుంబంపై కాంగ్రెస్ సర్పంచ్ తుకారాం రెడ్డి, ఇంకొందరు కలిసి దాడి చేశారు. గుడిలోకి రావొద్దంటూ దాడి చేయడంతో.. మూడు నెలల పాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>