Mobile Popup Ad
Mobile Popup Ad

రాయ్‌పూర్‌లో ఘోరం : సిగరెట్ తాగొద్దన్నందుకు పెట్రోల్ బంకులో నిప్పు

కలం, వెబ్​ డెస్క్​ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఒక పెట్రోల్ పంపు (Raipur Petrol Pump) వద్ద ప్రమాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ పంపు ప్రాంగణంలో సిగరెట్ తాగవద్దని వారించినందుకు ఆగ్రహానికి గురైన ధర్మేంద్ర అనే యువకుడు ఉన్మాదంతో వ్యవహరించాడు. సిబ్బంది మాట వినకపోగా తన వద్ద ఉన్న లైటర్‌ను వెలిగించి ఏకంగా పెట్రోల్ పంపు నాజిల్ పైపు వద్ద నిప్పు పెట్టాడు.

దీంతో పెట్రోల్ పంపు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న వాహనదారులు భయంతో పరుగులు తీశారు. అయితే పెట్రోల్ పంపు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ధర్మేంద్రను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>