Mobile Popup Ad
Mobile Popup Ad

స్టాలిన్‌తో చేతులు కలిపిన ‘అమ్మ’ వీరాభిమాని

కలం, వెబ్ డెస్క్:  జయలలితకు వీరాభిమానిగా, ప్రియశిష్యుడిగా, నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఓ.పన్నీర్‌సెల్వం (Panneerselvam) , తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఐదేండ్ల డీఎంకే పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రజల్లో స్టాలిన్‌పట్ల, డీఎంకే ప్రభుత్వం పట్ల నమ్మకం పెరిగిందని, మళ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు.

అన్నాడీఎంకే, బీజేపీ చేతులు కలుపుతున్న తరుణంలో ఆ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఓపీఎస్ ఇప్పుడు స్టాలిన్‌కు దగ్గర కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీల మధ్య పొత్తులు కుదురుతున్నాయి. ఇప్పటికే డీఎంకేకు మద్దతుగా దివంగత సినీనటుడు విజయకాంత్ స్థాపించిన డీఎండీకే దగ్గరైంది. విజయకాంత్ భార్య ప్రేమలత రెండు రోజుల క్రితం స్టాలిన్‌ను కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>