ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. దేశ యువతను చూస్తే తనకు గర్వంగా ఉందని, తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు చేసిన పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక గొప్ప ముందడుగు అని చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వీధుల్లోకి వచ్చి అత్యంత దృఢంగా నిలబడిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అయితే మిగిలిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ఇంకా నెరవేర్చలేదని వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను గౌరవిస్తూ ప్రధాని మోదీ స్వయంగా క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే ఆందోళన సమయంలో విద్యార్థులపై హింసకు పాల్పడిన అధికారులపై, వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే సమాజంలోని ఇతర వర్గాలైన రైతులు, కార్మికులు, పేదలను మోదీ సర్కార్ అణచివేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అణగదొక్కిన ప్రతి ఒక్కరూ తమ ఆత్మగౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా, దృఢంగా నిలబడటంలోనే నిజమైన ధైర్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఎవరూ భయపడొద్దని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Read Also: నా సలహా మేరకే ధర్మేంద్ర రాజీనామా.. శరద్ పవార్ సంచలన స్టేట్‌మెంట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>