కలం, కరీంనగర్: కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) సకాలంలో స్పందించి కాపాడారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామానికి చెందిన నేతి మానస (23) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ ఆదేశాల మేరకు బ్లూకోల్ట్స్ (Blue Colts) సిబ్బంది అఫ్జల్, హోంగార్డు ప్రసాద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్లూకోల్ట్స్ సిబ్బంది మహిళను సురక్షితంగా కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి, మానసిక ధైర్యాన్ని కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లిష్ట సమయంలో వేగంగా స్పందించి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్, హోంగార్డు ప్రసాద్లను ఏసీపీ విజయకుమార్, సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల తక్షణ స్పందనతో ఓ నిండు ప్రాణం కాపాడబడటంపై స్థానికులు అభినందనలు తెలిపారు.
Read Also: ముచ్చటగా మూడోసారి.. సీజేపీతో ముగిసిన చర్చలు
Follow Us On: X(Twitter)

