అడెల్లి పోచమ్మ ఆలయానికి భారీ ఆదాయం

కలం, సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ మహా పోచమ్మ ఆలయం (Adelli Pochamma Temple)లో వివిధ వ్యాపార హక్కుల కోసం మంగళవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. 2026-27 సంవత్సర కాలపరిమితికి సంబంధించి కొబ్బరికాయల విక్రయ హక్కు, ప్యాలాలు, పుట్నాలు విక్రయ హక్కు, టోల్ ట్యాక్స్ వసూలు హక్కు, పూలు, పూలమాలల విక్రయ హక్కు, కొబ్బరి ముక్కల సేకరణ హక్కు, తైబజారు వసూలు హక్కు, ఇడుపుల పిల్ల మేకల సేకరణ హక్కు, ఇతర హక్కులకు వేలం నిర్వహించారు.

ఈ వేలంపాట ద్వారా ఆలయానికి మొత్తం రూ. 64,35,000 లక్షల ఆదాయం సమకూరినట్లు ఇన్చార్జి ఈఓ భూమయ్య తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రవికిషన్ గౌడ్, ఆలయ మాజీ చైర్మన్లు, మాజీ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>