epaper
Wednesday, February 18, 2026
epaper

భారత్, యూఎస్ డీల్.. ప్రమాదంలో మన డేటా: రాహుల్

కలం, వెబ్ డెస్క్: భారతదేశ డేటా ప్రమాదంలో పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్, యూఎస్ ట్రేడ్ డీల్ (India US Deal) మీద తనకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఏఐ యుగంలో డేటా అత్యంత కీలకమని రాహుల్ చెప్పారు. అందుకే మన డేటా మీద అగ్రరాజ్యం అమెరికా కన్నేసిందని విమర్శించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన దేశ డేటా అగ్రరాజ్యం అమెరికాకు ఎంతో అవసరమని చెప్పారు. భారత్ సార్వభౌమాధికారమే ప్రమాదంలో పడిందని విమర్శించారు. అమెరికా మన దేశ డాటాను తీసుకుంటుందేమోనని పేర్కొన్నారు. డాలర్ విలువ బలంగా ఉండాలంటే మన దేశ డాటా అమెరికాకు అవసరమని పేర్కొన్నారు. ‘భారత్ అమెరికాతో సమానమైన దేశం. పాకిస్థాన్‌తో సమానమైనది కాదు. అందుకే మనం ఇప్పుడు అమెరికా లాంటి దేశాలతో జాగ్రత్తగా ఉండాలి‘ అంటూ రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం యుద్ధకాలం కాలం నుంచి ఏఐ వైపు పరుగులు తీస్తున్నాదన్నారు. అమెరికా సూపర్‌పవర్‌గా ఉండేందుకు తన ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే అమెరికా డేటా మీద ఫోకస్ పెట్టిందని విమర్శించారు.

ఐటీ సెక్టార్‌కు ఏఐ నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. భారతీయులకు సంబంధించిన డేటా అమెరికాకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యూఎస్, భారత్ డీల్ జరిగిన తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘అమెరికా రైతులు ఆ దేశానికి ఎంత ముఖ్యమో.. భారతదేశ రైతులు మనకూ అంతే ముఖ్యం ఈ విషయాన్ని ట్రంప్ కు మన దేశం స్పష్టంగా చెప్పాలి.‘ అంటూ రాహుల్ సూచించారు.

‘భారతదేశ చరిత్రలో తొలిసారి మన రైతులు ఎంతో సంక్షోభం ఎదుర్కొంటున్నారు. మన దేశ ఉత్పత్తులను అమెరికాకు పంపించేందుకు డోర్లు ఓపెన్ చేశారు. అమెరికా, భారత్ ట్రేడ్ డీల్ ద్వారా మనదేశంలోని రైతులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అమెరికా కంపెనీలకు ట్యాక్స్‌హాలీడే ప్రకటించారు. ఇంధన భద్రతను గాలికి వదిలేశారు.’ అంటూ రాహుల్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>