ట్రంప్‌కు షాక్.. బ్రెజిల్ అధ్యక్షుడిగా 80 ఏళ్ల లూలా రికార్డ్ విజయం!

కలం, వెబ్ డెస్క్ : బ్రెజిల్ రాజకీయంలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. దేశంలో ఎంతో ఆసక్తిగా సాగిన రన్-ఆఫ్ ఎన్నికల్లో వామపక్ష వర్కర్స్ పార్టీ అగ్రనేత, 80 ఏళ్ల లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా అద్భుత విజయం సాధించి మళ్లీ ఆ దేశ అధ్యక్షుడిగా (Brazil President) నిలిచారు. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ పోరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కొడుకు ఫ్లావియో బోల్సోనారోపై దాదాపు 26 లక్షల ఓట్ల ఆధిక్యంతో లూలా జయకేతనం ఎగరవేశారు.

ఎన్నికల్లో సాధించిన విజయాన్ని బ్రెజిల్ అత్యున్నత ఎన్నికల కమిషన్ అధికారికంగా ధృవీకరించడంతో దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో లూలా విజయం సాధించడం ద్వారా బ్రెజిల్ రాజకీయంలో మళ్లీ ఒక నూతన శకం ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో కొంత వెనుకబడినప్పటికీ, రన్-ఆఫ్‌లో కోలుకుని గెలిచిన తొలి నేతగా లూలా కొత్త చరిత్ర సృష్టించారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ విధానాలను, భావజాలాన్ని బహిరంగంగా విమర్శించే నాయకుడిగా పేరుపొందిన లూలా, 80 ఏళ్ల వయసులో నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. 2003 నుంచి 2011 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేసిన లూలా డి సిల్వా.. 2022లో జైర్ బోల్సోనారోను ఓడించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. రైట్ వింగ్ దూకుడు, పెరిగిన ధరలు, అవినీతి సవాళ్లను ఎదుర్కొని లూలా డి సిల్వా తాజాగా మరోసారి అధికారం చేపట్టడం విశేషం. లూలా డి సిల్వా గెలుపు లాటిన్ అమెరికాలో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గానికి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>