ఓట్ల చోరీకి ఆ నలుగురిదే బాధ్యత: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఓట్ల చోరీకి ప్రధానంగా నలుగురిదే బాధ్యతని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్, మోహన్ భాగవత్ ప్రజల ఓట్లు కుట్రపూరితంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. వీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నారని, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలుగా దీన్ని తాము చూస్తూ ఊరుకోబోమని.. కచ్చితంగా వీరిపై చర్యలుంటాయన్నారు. చట్టం ముందు నిలబెడుతామని.. అది ఎలా ఉండబోతుందనేది మీరే చూస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒక హోటల్‌లో కాంగ్రెస్ ఎంపీలు లంచ్ చేశాక.. గాంధీ స్మృతివనానికి బయల్దేరారు. అక్కడే నిరసన తెలపబోతున్నారు.

వాళ్లు ఏం చేసినా ప్రజా వ్యతిరేకతనే: ఖర్గే

ప్రధాని మోదీ, అమిత్ షా ఏదీ చేసినా ప్రజా వ్యతిరేకతనే ఎదురవుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఓట్ల చోరీ, ద్రవ్యోల్బణం పెరగడం, యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మంచి పనులు చేసేలా బుద్ధి కలగాలని గాంధీ స్మృతివనంలో ప్రార్థన చేయబోతున్నట్లు తెలిపారు. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి గొప్ప నేతలు దేశ ప్రజలకు అందించిన స్వేచ్ఛను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>