మంథని న్యాక్‌ పై రచ్చ.. శ్రీధర్‌బాబుపై పుట్ట మధూకర్‌ ఫైర్!

కలం, కరీంనగర్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోనే అద్బుతం సృష్టించినట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న మంథనిలో న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ సమాజానికి జవాబు చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ (Putta Madhukar ) డిమాండ్‌ చేశారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంథని ఎమ్మెల్యే పనితనాన్ని చూస్తే జాలి కలుగుతాందని అన్నారు.

దుద్దిళ్ల కుటుంబం ఓట్ల కోసం అలవాటు పడిందని, ఓట్ల కోసం తప్ప అభివృద్ది కోసం ఏనాడు ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు. ఈ విషయాలను సమాజం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన గుర్తు చేశారు. మంథనికి న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చినా అని ఎదో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 32నెలలు గడిచిన తర్వాత ఈ సెంటర్‌ తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యే అవమాన పడాలని అన్నారు.

2004 నుంచి 2009 మధ్యలోనే జీవన్‌రెడ్డి జగిత్యాలకు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. సమాజం మీద ధ్యాస ఉంటే, అభివృద్ది చేయాలనే ఆలోచన ఉంటే ఈ న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు తీసుకువచ్చే వారని అన్నారు. దుద్దిళ్ల కుటుంబం ఎనిమిదో సారి ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారని, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ 25 ఏండ్లు ఆయన తండ్రి 15ఏండ్లుగా అధికారంలో ఉంటున్నారని గుర్తు చేశారు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన పొన్నం ప్రభాకర్‌ గత మార్చిలోనే న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చారని, ఆనాడు రూ.20 కోట్లు తీసుకువస్తే ఈనాడు రూ.40 కోట్లు తీసుకురావాలే కానీ కేవలం రూ.20కోట్లు తెచ్చి గొప్పలు చెప్పుకోవడం, దాన్ని పత్రికలు గొప్పగా రాయడం చాలా బాధాకరమన్నారు. అసలు నూతనం భవనం నిర్మాణం అయిన తర్వాత న్యాక్‌ సెంటర్‌ ప్రారంభిస్తారా లేక అద్దె భవనంలో ప్రారంభిస్తారో క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32నెలలు గడిచిపోతుందని, రాష్ట్రంలో అంగన్వాడి సెంటర్లకు కోడిగుడ్డు బంద్‌ అని పేపర్లలో వచ్చిందని పేర్కొన్నారు. పెద్దపల్లి కాటారం రోడ్డు పూర్తి చేయడానికి ఐదు ఆరు కోట్లు చెల్లించలేకపోతున్నారని, ప్రజలు సైతం రోడ్డెక్కి ధర్నా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇలాంటి పనులు పూర్తి చేయాలని, కానీ 32నెలల తర్వాత న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చి ఏదో గొప్ప పని చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మంత్రిగా 32నెలల్లో ఏం చేశాననే ఆలోచన చేయాలని, ఈ విషయంపై పత్రికలు రివ్యూ చేసి కథనాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఆనాడే జీవన్‌రెడ్డి జగిత్యాలలో 2009 ముందు 20కోట్లతో భవనం కట్టిండని, అలాంటి భవనం కట్టాలంటే ఈనాడు రూ.40 కోట్లు కావాలని కానీ, మంథని ఎమ్మెల్యే తీసుకువచ్చిన రూ. 20 కోట్లు తక్కువే కదా? అని నిలదీశారు. ఎక్కువ కాలం నీ కుటుంబానికి ఈ సమాజం అవకాశం ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ అన్నారు. అలాంటి సమాజం గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ ఆలోచించలేదని, శ్రీధర్ బాబు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 32నెలల తర్వాత న్యాక్‌ సెంటర్‌ ఎందుకు తెచ్చినవో సమాజానికి జవాబు చెప్పాలన్నారు. పొన్నం ప్రభాకర్‌ మొదటిసారి ఎమ్మెల్యే అయిన కూడా మార్చిలోనే జీఓ తెచ్చిండని, ఫస్ల్‌ టైం ఎమ్మెల్యే కన్నా వెనకబడి ఉన్నావని శ్రీధర్ బాబును విమర్శించారు. సొంత నియోజకవర్గం కాకపోయినా పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ బిడ్డగా నీకన్నా ముందు పని చేస్తున్నాడన్నారు. శ్రీధర్ బాబుకు కూలగొట్టుడు, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్ది మీద దృష్టి లేదన్నారు. అభివృద్ది పనులకు కాగితాలను చూపించి మోసం చేయద్దని, న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని, అలాగే ఆలస్యం అయినందకు కారణం చెప్పాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>