Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ చరిత్రలో సంచలనం.. 264 లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో సంచలనం నమోదైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అద్భుతం చేసింది. డీసీ విధించిన 264 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే.. కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ప్రభుసిమ్రన్ 76, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 71* తుపాన్ ఇన్నింగ్స్ లకు తోడు ప్రియాన్ష్ ఆర్య 43, వధేరా 25 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.

అంతకుముందు రాహుల్ ఊచకోత..

తొలుత బ్యాటింగ్ కి దిగిన దిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్.రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 67 బంతుల్లో 152 పరుగులతో పంజాబ్ బౌలర్లను హడలెత్తించాడు. 264 భారీ స్కోర్ చేసినా.. పంజాబ్ భీకర బ్యాటింగ్ ముందు తలవంచక తప్పలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>