అత్యాచారం కేసు.. సీఎం భార్యపై లంచం ఆరోపణలు..!

కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గురుప్రీత్ కౌర్ (Gurpreet Kaur) ఒక అత్యాచార కేసును అణచివేయడానికి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శనివారం సుమోటోగా స్వీకరించింది. ఈ ఆరోపణలను పంజాబ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సి ధర్మాసనం, లంచం ఆరోపణలపై విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని పంజాబ్ సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సి తదుపరి చర్యలు తీసుకోనుంది. అలాగే, పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై వచ్చిన ఫిర్యాదును కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>