బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆధ్వ‌ర్యంలో సాగుతున్న కొండ‌గ‌ట్టు (Kondagattu) ఆశీర్వాద పాద‌యాత్ర‌లో తేనెటీగ‌ల దాడి క‌ల‌క‌లం రేపింది. శ‌నివారం ఉద‌యం బండి సంజ‌య్ బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు క‌రీంన‌గ‌ర్ నుంచి పాద‌యాత్ర‌ (Padayatra )గా కొండ‌గ‌ట్టుకు బ‌య‌లుదేరారు. పాద‌యాత్ర రామ‌డుగు మండ‌లం వెదిర గ్రామానికి చేరుకోగానే తేనెటీగ‌ల గుంపు దాడి చేసింది. దీంతో కార్య‌క‌ర్త‌లు ప‌రుగులు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో బండి సంజ‌య్ స‌హా ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కొద్దిమంది కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రం స్వ‌ల్ప గాయాలైన‌ట్లు స‌మాచారం. వెంట‌నే వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంతరం యథావిధిగా పాద‌యాత్ర కొన‌సాగించారు. సుమారు 40 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేసుకొని మ‌రికొద్ది సేప‌ట్లో బండి సంజ‌య్ కొండ‌గ‌ట్టుకు చేరుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>