నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి వ్యక్తి హత్య.. సీసీటీవీలో రికార్డ్

కలం, వెబ్ డెస్క్: పట్టపగలే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి ఓ వ్యక్తి హత్యకు గురైన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని లక్నోలో వెలుగు చూసింది. సందీప్ సింగ్ అనే ప్రాపర్టీ డీలర్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న ఓ దుండగుడు అతనిపై కాల్పులు (Property Dealer Shot Dead) జరిపాడు. రౌండ్లు కాల్పులు జరిపి చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడినుంచి బైక్‌పై పరారయ్యాడు. ఈ కాల్పుల్లో సందీప్ సింగ్ స్పాట్‌లోనే చనిపోయాడారు. ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నడిరోడ్డుపైనే కాల్చి చంపడంతో రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>