Mobile Popup Ad
Mobile Popup Ad

డీజీపీతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ.. ఏం జరగబోతున్నది?

కలం, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్‌(Prof Nageshwar) ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగేశ్వర్.. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ముందస్తు భద్రత అవసరమని  డీజీపీని కోరినట్లు తెలుస్తోంది.

నాగేశ్వర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

ఈ పరిణామాల నేపథ్యంలో నాగేశ్వర్  నివాసం వద్ద తెలంగాణ పోలీసులు మోహరించారు. ఎటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరని, లేకపోతే అది చట్టపరంగా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఏపీ పోలీసులు నిజంగా అరెస్ట్ కోసం వస్తే తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అరెస్ట్‌కు అనుమతి ఇస్తారా? లేదా అడ్డుకుంటారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వివాదాస్పదంగా మారిన కామెంట్లు

ఇటీవల నాగేశ్వర్ ఏపీ రాజకీయాలకు సంబంధించి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీ అధినేత జగన్ ను అరెస్ట్ చేయాలని .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారని.. అందుకు అమిత్ షా ఒప్పుకోలేదని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. నాగేశ్వర్ కు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర విశ్వసనీయత ఉండటంతో ఆయన వ్యాఖ్యలను చాలా మంది నమ్మారు. ఇక అప్పటి నుంచి జనసేన, టీడీపీ సోషల్ మీడియాకు నాగేశ్వర్ టార్గెట్ అయ్యారు. అసలు ఏ ఆధారంతో నాగేశ్వర్ ఇలా మాట్లాడారని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే పత్రికల్లో మీడియా చానళ్లలో వచ్చే ప్రతి వార్తకు సోర్స్ ఉంటుందని.. ఆ సోర్స్ ను ఎవరూ బయటపెట్టరని నాగేశ్వర్ బదులిచ్చారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఏపీలోని ఆయన మీద కేసు నమోదైంది. అరెస్ట్ తప్పదన్న ప్రచారం ఊపందుకున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>