కేఎల్ రాహుల్ రికార్డు బద్దలు కొట్టిన ఆర్యవీర్!

క‌లం, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) పెను విధ్వంసం సృష్టించాడు. మంగళవారం తమిళనాడుతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో 68 బంతుల్లోనే 181 పరుగులు చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఐపీఎల్ 2026లో కేఎల్ రాహుల్ చేసిన 152 పరుగుల రికార్డును ప్రియాంశ్ అధిగమించాడు. డాలీ కాలేజ్ గ్రౌండ్‌లో ఓపెనర్‌గా దిగిన ప్రియాంశ్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నాలుగు, ఐదు ఓవర్లలో వరుసగా 22 పరుగుల చొప్పున రాబట్టి, 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

పదో ఓవర్లో 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. 17వ ఓవర్లో 60 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని చేరి, చివరకు 19వ ఓవర్లో మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రియాంశ్ (Priyansh Arya) ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డును ప్రియాంశ్ సమం చేశాడు. ప్రపంచ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. లువాన్-డ్రే ప్రిటోరియస్ పేరిట ఉన్న 188 పరుగుల రికార్డుకు ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. ప్రియాంశ్ మెరుపులతో ఢిల్లీ 5 వికెట్లకు 275 పరుగుల భారీ స్కోరు సాధించింది. టోర్నీ చరిత్రలో ఇది ఉమ్మడిగా మూడో అత్యధిక స్కోరుగా నిలిచింది.

Also Read : మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా టాక్ షో.. ప్రోమో రిలీజ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>