కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న కొత్త టాక్ షో మెగావర్స్ (Megaverse)పై నెట్‌ఫ్లిక్స్ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది. ఈ షోకు సంబంధించి ఇటీవల చిరంజీవి పేరులో ‘N’ అక్షరం మిస్ అయ్యిందంటూ నెట్ ఫ్లిక్స్ ప్రచారం కూడా నిర్వహించింది. ఆ మిస్సింగ్ ‘N’ అర్థం నెట్‌ఫ్లిక్స్ అని ఈ ప్రోమో ద్వారా స్పష్టం చేశారు.
ప్రోమోలో చిరంజీవి చెప్పిన “ఇది నా అడ్డా” అనే డైలాగ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, ఈ టాక్ షో స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read : వృషకర్మ ట్రైలర్ లాంచ్ కౌంట్‌డౌన్ షురూ!
Follow Us On : WhatsApp

