Mobile Popup Ad
Mobile Popup Ad

నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేసి బస్సు డ్రైవర్ పరార్..!

కలం, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్ నుంచి పాల‌కొల్లు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) బస్సు డ్రైవర్ నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేసి పరారైన ఘటన కలకలం సృష్టించింది. బస్సు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం చేరుకోగానే బస్సులో డీజిల్ అయిపోయిందని చెప్పిన డ్రైవర్, ప్రయాణికులను రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ప్రయాణికులు డ్రైవర్ కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో రోడ్డుపైన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రయాణికులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రయాణికుల నుంచి సేకరించి విచారణ ప్రారంభించారు. సదరు బస్సు వర్మ ట్రావెల్స్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>