కలం, వెబ్‌డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్రా యూనివర్సిటీలో సోమవారం శతాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు. నేడు ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఉత్సవాల అనంతరం రాత్రి విశాఖలో బస చేయనున్నారు. అనంతరం మంగళవారం గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

