వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లుకు (Vande Mataram Bill) భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు నేటి నుంచి చట్టంగా మారింది. ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో జాతీయ చిహ్నాలను అవమానించడం, వందేమాతరం గేయాన్ని అవమానించడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. వందేమాతర గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానించేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటారు. దేశభక్తిని, జాతీయ భావాలను మరింత పెంపొందించే దిశగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంది.

రాజ్యసభ ఈ బిల్లును జూలై 29న ఆమోదించగా, లోక్‌సభ జూలై 30న దీనికి ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ (Droupadi Murmu) కూడా ఈ బిల్లుకు (Vande Mataram Bill) ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది. దీంతో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట పై తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Also Read : రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్‌పై యూత్‌కి సూచనలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>