రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌కు పద్మ శ్రీ అవార్డులు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల (Padma Awards) కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్, తెలుగు నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌కు పద్మ శ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. అలాగే ప్రముఖ నటుడు మమ్ముట్టి, టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్‌, ప్రముఖ సింగర్ అల్కా యాగ్నిక్‌కు పద్మ భూషణ్ పురస్కారాలను అందించారు. నటుడు ఆర్.మాధవన్‌కు, ఫోక్ సింగర్ పోకిలా లెక్తిపికి పద్మ శ్రీ, జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్‌కు మరణానంతరం పద్మ భూషణ్ అవార్డును ఆయన సతీమణి అందుకున్నారు. రెండో విడతలో 65 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>