Mobile Popup Ad
Mobile Popup Ad

కోర్టుకు అర‌వ శ్రీధ‌ర్ బాధితురాలు హ‌ర్ష‌వీణ‌.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ (Arava Sridhar) బాధితురాలు హ‌ర్ష‌వీణ (Harsha Veena) నేడు రైల్వే కోడూరు కోర్టుకు హాజ‌ర‌య్యారు. గ‌తంలో అర‌వ శ్రీధ‌ర్‌పై ఆమె తీవ్ర‌ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌తో త‌న కుమారుడిని హ‌ర్షవీణ వేధిస్తోంద‌ని శ్రీధ‌ర్ త‌ల్లి ప్ర‌మీల‌మ్మ‌ రైల్వే కోడూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమీలమ్మ పెట్టిన కేసులో మార్చి 2న రాష్ట్ర హైకోర్టు నుంచి హర్షవీణ బెయిల్ పొందారు. అయితే కోర్ట్ కొన్ని ష‌ర‌తులు విధించింది. ప్రతి శనివారం స్థానిక స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

హైకోర్ట్ ఆదేశాలతో బెయిల్‌కు సంబంధించి షూరీటీలు స్థానిక కోర్టులో దాఖలు చేసేందుకు హర్షవీణ (Harsha Veena) రైల్వే కోడూరుకు వ‌చ్చారు. మ‌రోవైపు యూట్యూబర్‌పై దాడి చేసి, నిర్బంధించిన మరో కేసులో హ‌ర్ష‌వీణ ఇప్ప‌టికే బెయిల్ పొందారు.

Read Also: టీటీడీలో గోల్డ్ స్కామ్?.. సాధు పరిషత్ సంచలన ఆరోపణ

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>