Mobile Popup Ad
Mobile Popup Ad

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..!

క‌లం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు డార్లింగ్ అప్ క‌మింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌భాస్ సాధార‌ణంగానే సినిమాలు పూర్తి చేసేందుకు చాలా టైం తీసుకుంటాడు. అలా చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన‌ రాజా సాబ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌ర్చింది. ఇక డైరెక్ట‌ర్ మారుతికి సోష‌ల్ మీడియాలోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో కూడా అభిమానులు చుక్క‌లు చూపించేశారు. ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. క‌ల్కి-2, స‌లార్‌-2, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ షూటింగ్స్‌తో ప్ర‌భాస్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఫౌజీ (Fauzi)లో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్, సోల్జ‌ర్‌ అంటూ ర‌క‌ర‌కాలుగా రూమ‌ర్లు వ‌చ్చాయి.

అయితే లేటెస్ట్‌గా వ‌స్తున్న అప్‌డేట్స్ ప్ర‌కారం ఫౌజీలో ప్ర‌భాస్ ఒక సోల్జ‌ర్‌గానే ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న ఫౌజీలో ప్ర‌భాస్ (Prabhas) స‌ర‌స‌న ఇమాన్వి (Imanvi) అనే కొత్త భామ న‌టిస్తోంది. హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ పూర్తిగా ముందెన్న‌డూ క‌నిపించ‌ని లుక్‌లో ద‌ర్శన‌మిస్తాడ‌ట‌. ఇక వ‌చ్చే నెల‌లో ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే క‌నిపిస్తాడు. ఇక సినిమాలు విడుద‌ల ఉంటే త‌ప్ప పెద్దగా బ‌య‌ట క‌నిపించ‌డు. రాజాసాబ్ త‌ర్వాత కెమెరాకు చిక్క‌ని ప్ర‌భాస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. ఇక ఫౌజీ మూవీని ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read Also: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>