కలం, వనపర్తి: ప్రతి గర్భిణి, బాలింత పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్పంచ్ రాజు నాయక్ సూచించారు. కందిరీగ తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం సర్పంచ్ ఆధ్వర్యంలో పోషణ మాసం (Poshan Maah) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలని సూచించారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ హజీరా బేగం, పంచాయతీ కార్యదర్శి రాధ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, డీలర్, తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

