Mobile Popup Ad
Mobile Popup Ad

రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: మద్ధతు ధర అడిగినందుకు ఖమ్మంలో రైతన్నలకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) మండిపడ్డారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతువారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 5 , 6, 7 తేదీలలో వరంగల్ లో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం 10 ఏండ్లు పాలించి రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల అందించలేదని విమర్శించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ అని.. రైతులను రాజును చేసింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు.

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రైతు డిక్లరేషన్ సభ నుండి ఇచ్చిన హామీలను రైతన్నలకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రైతుపక్షపాతి ప్రభుత్వంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పండిన వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు 2లక్షల చొప్పున రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసాను ఎకరానికి 12 వేలకు పెంచి ఇస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు కమీషన్ కూడ ఏర్పాటు చేసిందని మంత్రి (Ponguleti) వివరించారు.

Read Also: ఉమ్మడి నల్లగొండలో ‘ఈవీ’ విప్లవం.. ఎలక్ట్రిక్ వాహనాలు రయ్‌రయ్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>