కలం, చండూరు : వ్యాపార సేవా ప్రవీణ అవార్డు రావడం చాలా సంతోషకరమని నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ (Thelukuntla Chandrahsekhar) అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో రుద్రాక్ష వైభవం పీఠం అనుబంధ సంస్థ లలిత కళా సమైక్య ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాలో భాగంగా తేలుకుంట్ల చంద్రశేఖర్ కు వ్యాపార సేవా ప్రవీణ అవార్డును అందజేశారు. స్వర్ణ ఘంట కంకణం, ప్రశంసా పత్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటున్నానని, పేద ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. వ్యాపార రంగంలో వ్యాపారవేత్తగా రాణించి ఎందరికో ఉపాధి కలిగించానని పరోక్షంగా ఎందరికో సహకారాన్ని అందించానన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకు ఇంకా మరింత ప్రోత్సాహంతో పాటు స్ఫూర్తినిచ్చిన లలిత కళా సమైక్య సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన వ్యాపార రంగంలోని వారికి, రాజకీయ వర్గాల వారికి, సేవా సంస్థల మిత్రులకు, శ్రేయోభిలాషులకు చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.

