కలం, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) నేడు తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. స్వామివారి సేవలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం పొంగులేటికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

