అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో పాల్గొన్న నారా లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు.. క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన భార్య నారా బ్రహ్మణితో  కలిసి వెళ్లినట్లు లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వేడుకలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani), జైషా(Jay Shah) వంటి ప్రముఖులను కలిసినట్లు తెలిపారు. వారితో పాటు పలువురు స్నేహితులతో కూడా మాట్లాడినట్లు లోకేశ్ పేర్కొన్నారు. అర్జున్ టెండూల్కర్‌కు జీవితంలో ఆనందం, క్రికెట్‌లో మరెన్నో గుర్తుండిపోయే విజయాలు సాధించాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>