అర్హులైనవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు: మంత్రి పొంగులేటి

కలం హనుమకొండ: అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం కమలాపూర్ మండలంలో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఇళ్లతో పాటు తాగునీరు, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే..

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కమలాపూర్‌ మండలంలో 394 కుటుంబాలకు ఇళ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో తనిఖీ చేశాకే లబ్ధిదారులను ఎంపిక చేశామని, అనర్హులుగా తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో లబ్ధిదారులు ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>