పేదల వైద్యానికి ‘సీఎంఆర్ఎఫ్’ ధీమా: మంత్రి పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో : ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కొండంత ఆసరాగా నిలుస్తుండగా, అనారోగ్యంతో బాధపడే నిరుపేదల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత ధీమానిస్తోందని ఆయన పేర్కొన్నారు. ​

ఆదివారం ఖమ్మంలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద ఉన్న తన నివాసంలో ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని 216 మంది లబ్ధిదారులకు రూ.1,02,51,000 (ఒక కోటి రెండు లక్షల యాభై ఒక్క వేలు) విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇందులో కళ్యాణలక్ష్మి పథకం కింద ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా, వైద్య సహాయం కింద ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 95 మందికి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 70 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>