రేపటి నుంచి తెలంగాణలో బార్ & రెస్టారెంట్స్ బంద్

కలం, వెబ్ డెస్క్ : అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్ల బంద్‌ (Telangana Bars Closed)కు తెలంగాణ బార్ & రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మద్యం లైసెన్స్ నిబంధనలు, ప్రివిలేజ్ ఫీజుల పెంపు, వార్షిక ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గతంలో రూ.40 లక్షలుగా ఉన్న బార్ లైసెన్స్ ఫీజును రూ.44 లక్షలకు పెంచడంతో పాటు, ప్రివిలేజ్ ఫీజుల స్లాబ్‌ను 8% నుండి 20% వరకు అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని యజమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలంగాణ బార్ & రెస్టారెంట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై ఇప్పటికే ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేసిన అసోసియేషన్ నాయకులు, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఒక్కో బార్‌ నిర్వహణపై దాదాపు 60 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల బార్లు మూతపడి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ఫీజులను రద్దు చేయకపోతే, బంద్ అనంతరం ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>