శ్రీకాంత్ చారి త్యాగం వెలకట్టలేనిది: మంత్రి పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ మహిళా కమిషన్ మెంబర్ గా నియమితులైన సందర్భంగా వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హృదయ పూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. స్వరాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనకు తాను ఆత్మార్పణ చేసుకుని, ఉద్యమానికి ఊపిరినచ్చి తన ఊపిరిని వదిలిన అమరుడు శ్రీకాంతాచారి అని కొనియాడారు.

ఆయన త్యాగం వెలకట్టలేనిదని.. ఆ సాహసం చరిత్ర మరువనిదని పేర్కొన్నారు. నాడు బిఆర్ఎస్ పాలనలో అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి అడుగడుగునా అవమానం జరిగిందని విమర్శించారు. నేడు ప్రజాపాలనలో ఆ వీరుని త్యాగానికి వారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలిగా సముచిత గౌరవం ఇచ్చామని చెప్పారు. ఇది యావత్ తెలంగాణ గర్వించదగిన విషయమని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>