Mobile Popup Ad
Mobile Popup Ad

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఐ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా విధానాలు రూపొందిస్తూ సామాన్యుడు మీద మోయలేని భారం మోపుతోందని సీపీఐ మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్ అన్నారు. శనివారం బృంగి బాలకిషన్ ఆధ్వర్యంలో సీపీఐ నేతలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బాల కిషన్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజాగా పెట్రోల్ ,డీజిల్ ధర పెరుగుదలతో మరింత భారం పెరిగిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి.. నిత్యావసర, కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 రోజుల క్రితం వాణిజ్య గృహ వినియోగ సిలిండర్ ధరలను భారీగా పెంచి, కనికరం లేకుండా సామాన్య ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారం మోపిందని వెల్లడించారు.

కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని అన్నారు. గడిచిన 12 ఏళ్లుగా అదానీ ,అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసనల్లో పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

పెంచిన పెట్రోల్ ,డీజిల్ వెంటనే తగ్గించని ఎడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సురేష్ ,కే.పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, మహేష్, వినియోగదారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు బాలరాజ్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ , మహిళా పట్టణ కార్యదర్శి ఇందిరక్క, పట్టణ నాయకులు సుందర్ రాజ్,నరసింహ, కృష్ణయ్య, రణత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>