కలం, వెబ్ డెస్క్ : తన కళ్ల ముందు ఎలాంటి ఘోరం జరిగినా పట్టించుకోకుండా పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్న రోజులు ఇవి. అలాంటిది ఓ సామాన్య ఆటోడ్రైవర్ ప్రాణాలకు తెగించి గొలుసు దొంగతనం చేస్తున్న రౌడీషీటర్ ను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కాగా, డ్రైవర్ అసామాన్య ధైర్యాన్ని తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సోమవారం బంజారాహిల్స్ లోని టీజీసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. కాగా, రౌడీ షీటర్ సోహెల్ పై గోషా మహల్ పీఎస్ లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
4వ తేదీ (మంగళవారం) తెల్లవారుజామున బేగం బజార్ జెన్నీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ కు వెళ్లారు. ఈ క్రమంలో డబీర్ పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్.. మంజు మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జామెర్ స్పందించాడు. పారిపోతున్న రౌడీ షీటర్ బైక్ ను ఆటోతో ఢీ కొట్టి కిందపడేశాడు. నిందితులు జామెర్ పై దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించాడు.
అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ చేసిన పోరాటం ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆటో నెంబర్ ద్వారా పోలీసులు జాహెర్ ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం, సీపీ (CP Sajjanar) జామెర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్ర మోహన్, గోషామహల్ ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం
✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026
Read Also: 7న విజయ్ ప్రమాణ స్వీకారం? రేపు గవర్నర్‌తో భేటీ
Follow Us On : WhatsApp

