కలం, హనుమకొండ : బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో హనుమకొండలో (Hanumakonda) ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను ఓ యువకుడు తొలగించిన ఘటన కలకలం రేపింది. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాలలో బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, వాటిలో కొన్ని జెండాలను ఓ యువకుడు తీసివేస్తుండగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో “మోదీ హిందూ, ముస్లింలను వేరు చేస్తున్నాడని భావించి జెండాలను తొలగించానని” ఆ యువకుడు పేర్కొన్నాడు.

