Mobile Popup Ad
Mobile Popup Ad

త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌లు.. ఓటర్ల‌కు మోదీ కీల‌క సందేశం

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) ఓట‌ర్ల‌కు కీల‌క సందేశాన్ని అందించారు. ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టులో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లంతా త‌మ బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ ప్ర‌జాస్వామ్య పండుగ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌న్నారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలన్నారు. ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారి రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, బెంగాల్‌ల‌ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్ర‌జ‌లు ఓటు రూపంలో తమ గళాన్ని వినిపించాలని ఆయన ఆకాంక్షించారు.

Read Also: త్వ‌ర‌లో చంద్ర‌బాబు బ‌యోపిక్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>