కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) జీవితం ఆధారంగా త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు భాను శంకర్ (Bhanu Shankar) దర్శకత్వం వహించనున్నారు. భాను శంకర్ గతంలో ఏపీ రాజధాని అమరావతి మీద రాజధాని ఫైల్స్ అనే సినిమా రూపొందించారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక చంద్రబాబు జీవితంలో ముఖ్య సంఘటనలు, ఆయన రాజకీయ జీవితం, ఎత్తుపల్లాలను కేంద్రంగా తీసుకొని బయోపిక్ రూపొందిస్తున్నట్లు భాను శంకర్ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. త్వరలోనే సినిమా పేరు, నిర్మాణ సంస్థ, చిత్రీకరణ వివరాలను తెలియజేస్తామని భానుశంకర్ వెల్లడించారు.

