Mobile Popup Ad
Mobile Popup Ad

ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీకి తెలంగాణ వాసుల ఘన స్వాగతం

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇజ్రాయెల్‌ (Israel) లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి అక్కడి  భారతీయులు, తెలంగాణ వారు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ రెండు రోజుల పర్యటన బుధ గురువారాల్లో సాగగా.. కింగ్ డేవిడ్ హోటల్‌లో ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు, ఇజ్రాయెల్ ఇండియన్ వ్యాపారులు కలిశారు. 200 మంది ప్రత్యేక అతిథులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇజ్రాయెల్‌లోని అన్ని రంగాల వారైన ఇండియన్స్ ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

భారతీయ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రధాని ఇజ్రాయెల్‌కు రావడం పట్ల ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి సోమ రవి (Soma Ravi) హర్షం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నామని.. 2017లో వచ్చారనీ గుర్తు చేసుకున్నారు. ఈసారి నేరుగా కలవడం షేక్ హ్యాండ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని (PM Modi) ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల సత్సంబంధాలు మెరుగు పడటానికి దోహదం చేస్తాయని తెలిపారు. ఇజ్రాయెల్ లో 50000 భారతీయులు ఉండగా.. 2000 మంది తెలంగాణ వారు ఉన్నారు.

Read Also : జర్నలిస్టులకు అలర్ట్.. అక్రిడిటేషన్ గడువు మరోసారి పొడిగింపు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>