Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్‌పై హ‌త్యాయ‌త్నం.. ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి

క‌లం వెబ్ డెస్క్: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)పై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌పై భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. ట్రంప్ స‌హా ఆయ‌న భార్య‌ మెలానియా ట్రంప్‌, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ లక్ష్యంగా వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింద‌న్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన ఘ‌ట‌న‌లో వారంతా సురక్షితంగా బయటపడటం మంచి ప‌రిణామ‌మ‌న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో హింసకు ఎటువంటి స్థానం లేదని, ఇలాంటి దాడులను బలంగా ఖండించాలని మోదీ పిలుపునిచ్చారు. ట్రంప్ క్షేమం ఆందోళ‌న వ్యక్తం చేస్తూ మోదీ చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>