రాజకీయాలు అందుకే ప‌క్క‌న‌పెట్టాను.. హీరో రాజ‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు!

క‌లం వెబ్ డెస్క్: సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ (Rajasekhar) సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. ఇటీవ‌ల బైక‌ర్ సినిమాతో రాజ‌శేఖ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్‌, న‌ట‌న‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆయ‌న మ‌రిన్ని సినిమాలు చేయాలంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. రాజ‌శేఖ‌ర్ కూడా త‌న‌కు మంచి పాత్ర‌లు ఇవ్వండంటూ డైరెక్ట‌ర్ల‌ను కోరారు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే గ‌తంలో రాజ‌శేఖ‌ర్, ఆయ‌న భార్య జీవిత గ‌తంలో రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీలో చేరి ఫుల్ టైం పాలిటిక్స్‌ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఏమైందో ఏమో తెలియ‌దు స‌డెన్‌గా రాజ‌కీయాలు పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇక దీనిపై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చారు. రాజ‌కీయాల‌ను మొత్తం ప‌క్క‌న పెట్ట‌లేద‌ని, కొన్ని రోజులు సినిమాల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. రాజ‌కీయాలు చాలా పెద్ద ప‌ని అని, సినిమాలు చేస్తూ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చామ‌న్నారు. రాజ‌కీయాల‌తో మ‌న‌స‌సుకు ఎంతో తృప్తి వ‌స్తుంద‌న్నారు. సినిమాల్లో మంచి స‌క్సెస్ వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. అయితే అది జ‌రుగుతుందో లేదో తెలియ‌ద‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>