ఓం బిర్లా సేవలు అమోఘం.. ప్రధాని మోడీ ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. ఓం బిర్లా కేవలం అత్యుత్తమ పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా, సభను సమర్థవంతంగా నడిపించే అద్భుతమైన స్పీకర్‌గా కూడా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమన్నారు. సభా నిర్వహణలో ఆయన చూపే చొరవ అందరికీ ఆదర్శనీయమని మోడీ ప్రశంసలు కురిపించారు.

అంతేకాకుండా, తన సొంత నియోజకవర్గమైన కోటా నగరాభివృద్ధికి ఓం బిర్లా చేస్తున్న కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోటా నగరం సాధిస్తున్న అభివృద్ధి ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తోందని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని ప్రధాని అభినందించారు. ప్రజాప్రతినిధిగా, స్పీకర్‌గా రెండు బాధ్యతలను ఓం బిర్లా (Om Birla) ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మోడీ అన్నారు.

Read Also: ఇరాన్ నౌక విషయంలో మాది సరైన నిర్ణయమే : భారత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>