ఉస్తాద్ భగత్ సింగ్ : డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh).. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో మూవీ వస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అయింది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. డైరెక్టర్ హారీశ్ శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ (Thaman) బాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు (Ustaad Bhagat Singh) సంబంధించి మరిన్ని సర్ప్రైజెస్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: సినీ నటుడు మురళీధర్ గౌడ్ ఇంట విషాదం

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>