పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi)  హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాదాపూర్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఇంటికి వెళ్లారు. ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు.

ప్రధాని మోదీ పర్యటన వేళ మాదాపూర్, పవన్ కళ్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ తన బిజీ సమయంలో కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్ ను పరామర్శించడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ భేటీ చారిత్రాత్మకమని జనసేన నేతలు కొనియాడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>