Mobile Popup Ad
Mobile Popup Ad

NHAI చైర్మన్‌తో మంత్రి కోమటి రెడ్డి భేటీ.. RRRపై చర్చ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు NHAI ప్రాజెక్ట్స్‌పై చర్చించారు. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న రీజినల రింగ్ రోడ్డు, హైదరాబాద్ – విజయవాడ (NH-65) విస్తరణ పనులు ప్రారంభంపై సుదీర్ఘంగా చర్చించారు. నిత్యం యాక్సిడెంట్స్ తో డెత్ రోడ్ గా పిలువబడుతున్న హైదరాబాద్ – విజయవాడ రహదారి 8లేన్ విస్తరణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని మంత్రి కోరారు. ఇదే రహదారిలో ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు నాగపూర్ తరహాలో 7.1కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

హైదరాబాద్ – విజయవాడ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు NHAI ఛైర్మన్ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో NHAI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, చేపట్టబోయే పలు ప్రాజెక్టుల అంశాలను ఛైర్మన్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా నిలిచే ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని NHAI ఛైర్మన్ ను మంత్రి కోరారు. ఈ మీటింగ్ లో రోడ్లు భవనాలు శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, NHAI రీజినల్ ఆఫీసర్ శివ శంకర్, ఆర్ అండ్ బి సీఈలు ధర్మారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>