మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నవారికి శిక్ష తప్పదు : ప్రధాని

కలం, వెబ్ డెస్క్ : 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోవడంపై ప్రధాని మోదీ (PM Modi) ప్రతిపక్షాలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేష్ బిల్లు (Women Reservation Bill) క్రెడిట్ విపక్షాలకే ఇస్తానని చెప్పినా ప్రతిపక్షాలు తమ పంతం వీడలేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ప్రధాని హెచ్చరించారు. నారీ శక్తి ఎవరి హక్కులనూ లాక్కునేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుతో మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రయత్నించామని చెప్పారు.

గతంలో ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ పార్టీల‌ను దేశ మహిళలు క్షమించలేద‌ని మోదీ (PM Modi) గుర్తు చేశారు. ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌ పరిస్థితి చాలా దారుణంగా మారింద‌న్నారు. ఇప్పుడు కూడా ఈ బిల్లును వ్యతిరేకించే వారిని దేశ మహిళలు క్షమించర‌ని వ్యాఖ్యానించారు. ఈ బిల్లును వ్య‌తిరేకించ‌డం ప్ర‌తిప‌క్షాల త‌ప్పు అని, దీని పరిణామాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు.

Read Also: బెంగాల్, తమిళనాడు ప్రజలు చక్కటి అవకాశాన్ని కోల్పోయారు : మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>