కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో మహిళా బిల్లు వీగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ (Congress) దేశాన్ని విభజించి లబ్ధి పొందాలనుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రాంతీయ పార్టీలతో జత కట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పటికీ బ్రిటిష్ విధానాలను అనుసరిస్తోందని, అధికారంలో ఉన్న సమయంలో మావోయిస్టులను ప్రోత్సహించిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వచ్చిందని మోదీ అన్నారు. జమిలి ఎన్నికలను కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం చేశాయన్నారు.
పార్లమెంట్‌లో మహిళల స్వప్నాన్ని ప్రతిపక్షాలు చిదిమేశాయని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు ఈ భ్రూణ హత్యలో భాగం ఉందని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించారు. కొందరికి దేశం కంటే రాజకీయాలు ఎక్కువని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకొని కుటుంబ వారసత్వ పార్టీలు పార్లమెంట్‌లో చప్పట్లు కొట్టాయన్నారు. మహిళా బిల్లును ఆపి సంబరాలు చేసుకున్నారని, ఇది మహిళల ఆత్మాభిమానంపై చేసిన దాడి అని మోదీ (PM Modi) అన్నారు.
Read Also: మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నవారికి శిక్ష తప్పదు : ప్రధాని
Follow Us On : WhatsApp

