నక్సల్స్ లేని దేశంగా భారత్:‎ ప్రధాని మోదీ

‎కలం, వెబ్ డెస్క్: నక్సల్స్ కారణంగా గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. వారి ప్రాంతాల అభివృద్ధి ఆగిపోయిందని, ప్రభుత్వ పథకాలు వారి వరకు చేరేవి కావని వివరించారు. దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయడంతో నక్సల్స్ లేని దేశంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంత ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు గిరిజనులు ఏమాత్రం పట్టించుకునేవావి కావని.. తాము వచ్చాకే పరిస్థితి మారిపోయిందన్నారు. నక్సల్స్ నాయకులు గిరిజన పిల్లలను బలవంతంగా తమలో కలిపేసుకున్నారని.. అలా గిరిజన తల్లులకు ఎంతో నష్టం జరిగిందన్నారు.

యువతకు మంచి విద్య, ఉద్యోగాలు..

ఒకప్పుడు నక్సల్స్ కారణంగా ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు యువతకు మంచి విద్య, ఉద్యోగాలు వస్తున్నాయని ప్రధాని మోదీ వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్లు తెలిపారు. 4 కోట్ల మందికి శాశ్వత ఇళ్లు, 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. 100 జిల్లాలు, 500 మండలాలు/బ్లాకులను ప్రత్యేకంగా తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అల్లూరి సీతారామరాజు సహా ఎంతో మంది గిరిజన నేతలు భారత స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. గిరిజన జాతికే చెందిన ద్రౌపది ముర్మ రాష్ట్రపతిగా సేవలందిస్తుండటం అందరికీ గర్వకారణమని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>