ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్​

కలం, నల్లగొండ బ్యూరో : సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని నల్లగొండ కలెక్టర్ (Nalgonda Collector) బి. చంద్రశేఖర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జి.చెన్నారం, ఎస్​ఎల్​బీసీ, లల్లాయిగూడలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ప్రమాణాలతో పాటు తూకం వేస్తే యంత్రాలు, రిజిస్టర్లు, కనీస సౌకర్యాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులతో పాటు రైతులతో కలెక్టర్ మాట్లాడారు.

తాలు, తరుగు వంటివి లేకుండా సరైన నాణ్యత ప్రమాణాలతో ధాన్యం వస్తే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. నాణ్యమైన ధాన్యంతో పాటు నాణ్యత లేనివి రెండు కలిపి మిల్లులకు పంపించవద్దని, వేరువేరుగా పంపించాలని సూచించారు. అలాగే ధాన్యం సేకరణలో మిల్లులకు పంపించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ (Nalgonda Collector)​ బి.చంద్రశేఖర్​ అధికారులకు సూచించారు.

Read Also: బీజేపీ మూలాలు బెంగాల్ లో ఉన్నాయి: ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>