కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాద్ పార్టీ తదితర విపక్షాలు మహిళా బిల్లును (Women Reservation Bill) వ్యతిరేకించి తప్పు చేశాయని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న దేశంలోని మహిళల దృష్టంతా పార్లమెంట్ పైనే ఉందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఏ ఒక్క పార్టీకి మేలు చేసే అంశం కాదని అన్నారు. ఇది దేశంలోని 50 శాతం జనాభా అయిన మహిళల హక్కు అని మోదీ చెప్పారు.
దశాబ్దాలుగా మహిళలకు ఈ హక్కు దక్కలేదన్నారు. ఇప్పుడు ఆ హక్కును వారికి అందించాల్సిన సమయం వచ్చాక నారీ శక్తిని అడ్డుకున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే ఈ బిల్లును ఎలా అడ్డుకున్నారో దేశ ప్రజలంతా చూశారని మోదీ అన్నారు. ఈ బిల్లు మహిళా సాధికారతకు, వికసిత్ భారత్ నిర్మాణానికి ఎంతో ముఖ్యమైనదని ప్రధాని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో లింక్ చేయడంపై ఎదురవుతున్న ఆందోళనలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం పెద్దదైనా, చిన్నదైనా, ఉత్తరాన ఉన్నా, దక్షిణాన ఉన్నా, తూర్పున ఉన్నా, పశ్చిమాన ఉన్నా ఏ దిక్కుకైనా అన్యాయం జరగదని మోదీ హామీ ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి న్యాయంగా, పక్షపాతం లేకుండా జరుగుతుందని ప్రధాని (PM Modi) స్పష్టం చేశారు.
Read Also: ఇండియాను మోదీ అమ్మేశారు: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)

